చిరంజీవికి నయనతార చేస్తున్న సాయం చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. మెగాస్టార్ కోసం తన పాలసీలు కూడా పక్కన పెట్టేసింది నయనతార. తన సినిమా కోసం చేయడానికి వస్తుంది. నయనతారకు ప్రమోషన్ కు కిలోమీటర్ల దూరం ఉంటుంది.. కానీ చేయలేదు. చిరంజీవి కోసమే సినిమా ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంది నయన్. దీని కోసం నిర్మాత రామ్ చరణ్ కూడా చాలా కష్టపడ్డాడు. ఈ ముద్దుగుమ్మను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డారు మెగా వారసుడు. నయన్ ప్రమోషన్ చేయడానికి ఒప్పుకుంటే తమిళ మలయాళ వెర్షన్ సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఇంతగా ఆరాటపడుతున్నాడు రామ్ చరణ్.
నయనతార చివరికి ప్రమోషన్ కు రావడానికి ఒప్పుకోవడంతో సైరా సినిమా విషయంలో మరో మెట్టు నిర్మాతగా రామ్ చరణ్ పైకి ఎక్కినట్లే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తైపోయింది. మరో రెండు నెలల్లో టాకీపార్టు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు సురేందర్ రెడ్డి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు పది ఎకరాల సెట్ వేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. మొత్తానికి రజినీకాంత్, బాలకృష్ణ లాంటి హీరోలకు కూడా ప్రమోషన్ కు రావాలి అంటే నో చెప్పిన నయనతార ఇప్పుడు చిరంజీవి కోసం వస్తుండటంతో అభిమానులు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు.