కథానాయకుడు బిజినెస్ అదరహో.. బాలయ్య ముందు భారీ లక్ష్యం..

ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ భయపెడుతుంది. ఇప్పటివరకు బాలయ్య సినిమాల్లో ఏ సినిమాకు సాధ్యం కానంత రేంజులో ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ జరుగుతుంది. కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది కానుంది. ఈ చిత్ర బిజినెస్ దాదాపు 72 కోట్లు జరిగింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బాలయ్య సినిమాలు గతంలో ఎప్పుడూ 50 కోట్లు కూడా దాటలేదు. కానీ ఇప్పుడు బయోపిక్ మాత్రం ఏకంగా 72 కోట్లకు చేరుకుంది. దాంతో బయ్యర్లలో టెన్షన్ మొదలైంది. ఇన్ని కోట్లు రావాలంటే సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. మరో ఆప్షన్ కూడా లేదు. జనవరి 9న కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ntr biopic trailer dialogues

నైజాంలో 13.5 కోట్లు.. సీడెడ్ లో 12 కోట్లు మిగిలిన చోట్ల కూడా భారీ బిజినెస్ చేసింది ఎన్టీఆర్ బయోపిక్. ఓవర్సీస్లో 10 కోట్లకు అమ్ముడుపోయింది ఈ చిత్రం. ఇంత మొత్తం రావాలి అంటే బాలయ్యకు తలకు మించిన భారమే అవుతుంది. కానీ సినిమా పై నమ్మకంగా ఉన్న బాలయ్య కచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాడు. పైగా దర్శకుడు క్రిష్ కావడంతో మరింత నమ్మకంగా ఉన్నాడు నందమూరి వారసుడు. అన్నగారి బయోపిక్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంత పోటీ ఉన్నా కూడా సంక్రాంతికి సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. మరి ఈయన నమ్మకం నిజమై నిజంగా 72 కోట్లు వస్తే బాలయ్య కొత్త చరిత్రకు తెర తీసినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here