ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.. 

ఎన్టీఆర్ సెన్సార్ ఎలాంటి కట్స్ లేకుండా బయటికి వ‌చ్చింది. ఇప్పుడు అంతా ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ రావడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు అందరిలోనూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితాన్ని క్రిష్ తెరపై అద్భుతంగా ఆవిష్కరించార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగంలో ఎక్కువగా వ్యక్తిగత జీవితాన్ని హైలెట్ చేశారు. అందులో ఆయన కష్టాలని ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి రావడం.. అక్కడి నుంచి ఆయన పడిన కష్టాలు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన విధానం అన్ని సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.

ఇక హీరోగా మారిన తర్వాత కూడా ఆయన అభిమానులతో ఉన్న విధానాన్ని ఎక్కువగా తెరపై ఆవిష్కరిస్తున్నాడు క్రిష్. ఎన్టీఆర్ ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన దివిసీమ ఎపిసోడ్ సినిమాలో హైలెట్ కానుందని తెలుస్తోంది. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు జోలె పట్టుకొని ఏఎన్నార్ తో కలిసి ఎన్టీఆర్ విరాళాలు సేకరించడానికి ఊరూరు తిరిగారు. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలెట్ కానుందని తెలుస్తోంది.  దాంతో పాటు బసవతారకం క్యాన్సర్ ఎపిసోడ్.. కొడుకు చనిపోయిన ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సినిమా అద్భుతంగా వచ్చిందని.. జనవరి 9న బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు ఎన్టీఆర్ యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here