అజిత్-ర‌జినీ వార్ లో విజ‌యం ఎవ‌రిది.. అజిత్ కొట్టేసాడా..?

రజనీకాంత్ పేట కంటే అజిత్ విశ్వాసమే గెలిచిందా.. ఇప్పుడు తమిళనాట వినిపిస్తున్న వార్తలు అయితే ఇవే. జనవరి 10న విశ్వాసంతో పాటు ర‌జినీకాంత్ పేట సినిమా కూడా విడుదలైంది. ఓవర్సీస్ లో పరిస్థితి ఎలా ఉన్నా కూడా తమిళనాట మాత్రం పేట‌ను పూర్తిగా డామినేట్ చేసింది విశ్వాసం. ఈ చిత్రానికి అక్క‌డ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 30 కోట్లు షేర్ తీసుకొచ్చి రజినీకాంత్ కంటే ముందున్నాడు అజిత్. 5 రోజుల్లోనే సినిమా దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది విశ్వాసం.

Petta vs Viswasam pongal collections

ఈ సినిమాను అమ్మిన రేట్లతో పోలిస్తే మరో వారం రోజుల్లో కచ్చితంగా సేఫ్ జోన్ కు వచ్చి హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ రజనీకాంత్ సినిమాకు అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 120 కోట్లు తీసుకురావాలి. అంటే దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ తీసుకురావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రావడం కష్టమే. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు అజిత్. రజినీకాంత్ పై పోటీకి వచ్చి విజయం సాధించి ఔరా అనిపించాడు ఈ హీరో. వివేకం సినిమాతో ఫ్లాప్ అందుకొని రేసులో వెనుకబడిపోయిన అజిత్.. విశ్వాసంతో మళ్లీ సత్తా చూపించాడు. ప్రస్తుతం ఈయన పింక్ తమిళ రీమేక్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here