విన‌య విధేయ రామ న‌ష్టాల‌కు దిక్కెవ‌రిప్పుడు..?

వినయ విధేయ రామ‌ సినిమాను తీసుకొని నష్టపోయిన బయ్యర్లకు ఇప్పుడు దిక్కు ఎవరు.. అనే వాదన ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడ‌నే ధైర్యంతో వాళ్లు భారీ రేట్లకు సినిమాను కొన్నారు. కానీ ఊహించని విధంగా తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా పైకి లేచే విధంగా ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పటికే ఈ సినిమా చాలా చోట్ల కలెక్షన్లు తీసుకురావడం కూడా ఆగిపోయింది.

5 రోజుల్లోనే సినిమా ఫుల్ ర‌న్ పూర్తి అయిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఇప్పుడు మిగిలిన ఏరియాల్లో కూడా వచ్చే నష్టాలను ఎవరు భరిస్తారో తెలియక డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. నైజాంలో దిల్ రాజుకు ఈ సినిమా దాదాపు ఏడు కోట్లు నష్టం తీసుకొచ్చేలా కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రలో కూడా భారీ నష్టాల వైపు పరుగులు తీస్తుంది విన‌య విధేయ రామ‌.

రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన ఈ సినిమా ఆయన ఇమేజ్ ను దిగజార్చింది. మరోసారి రొటీన్ కథను నమ్ముకొని అడ్డంగా బుక్కయ్యాడు మెగా వారసుడు. ఇప్పుడు ఈయ‌న చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా వినయ విధేయ‌ రామ సినిమా తీసుకొచ్చిన నష్టాలను ఇప్పుడు ఎవరు భరిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

vinaya vidheya rama pre-release business,

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here