ర‌జినీకాంత్ సినిమాలు మానేస్తున్నారా.. లాస్ట్ సినిమా ఎవ‌రితో..?

రజనీకాంత్ సినిమాలు మానేస్తున్నారా.. ఆయన ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా.. ఇప్పుడు ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. రజనీకాంత్ తన 43 ఏళ్ల సినిమా కెరియర్ కు ఇక శుభం కార్డు చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో బిజీ కావడానికి ఈయ‌న ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆయన చివరి సినిమా ఎవరితో చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఎప్పటినుంచో దర్శకధీరుడు కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే తాను ఇప్పటికీ వదులుకోను అని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు జక్కన్న.

 

Rajinikanth last Movie
Rajinikanth last Movie

దాంతో తన చివరి సినిమాను తెరకెక్కించే అవకాశం రాజమౌళికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు రజనీకాంత్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి.. పేట, మురుగదాస్ సినిమాలతో రజనీకాంత్ బిజీగా ఉన్నారు. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కలుస్తుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే రజినీకాంత్, రాజమౌళి సినిమా చేస్తే మాత్రం ఇండియన్ సినిమాలో అంతకంటే పెద్ద కాంబినేషన్ మరొకటి ఉండదేమో..? వీళ్ళిద్దరూ కలిసి చేస్తే సినిమా చేస్తే చూడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here