రజనీకాంత్ సినిమా అంటే ఎలా ఉంది అని అడక్కుండా కలెక్షన్లు వచ్చి వచ్చేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉంది అని కాదు.. ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు అభిమానులు. ఒకప్పుడు ఆయన నుంచి సినిమాలు వస్తే పండగ చేసుకునే ఫ్యాన్స్.. ఇప్పుడు అనవసరంగా నాసిరకం సినిమాలు చేస్తూ పేరు పాడు చేసుకుంటున్నాడు అంటూ బాధపడుతున్నారు.
కొన్నేళ్లుగా రజనీ సినిమాలు ఊహించిన విజయం సాధించడం లేదు. ఇక ఇప్పుడు ఈయన సంక్రాంతికి పేట సినిమాతో వస్తున్నాడు. తమిళ, హిందీ ఇండస్ట్రీలో భారీగా విడుదల అవుతున్న ఈ సినిమాకు తెలుగులో మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఈ చిత్రానికి సరిపోయినన్ని థియేటర్లు దొరకడం లేదు. ఇప్పటికే మూడు భారీ సినిమాలు తెలుగులో రానుండటంతో రజనీకాంత్ కు థియేటర్లు ఇవ్వలేమని చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
పైగా వారు ఈ సినిమాను కొనడానికి కూడా ముందుకు రావడం లేదు. దాంతో చాలా ఏరియాల్లో తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని తాను సొంతంగా విడుదల చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఇది నిజమైతే రజనీకాంత్ కు ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. మరోవైపు తమిళనాట కూడా ఈ చిత్రానికి భారీ పోటీ అజిత్ రూపంలో ఉంది. అక్కడ ఎలాగోలా రజనీ తన స్టామినాతో నెట్టుకొస్తాడేమో కానీ తెలుగులో మాత్రం రజినీ పని అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదు.
ఇక్కడ మూడు భారీ సినిమాలు ఉండటంతో పేట వాటి మధ్య ఇక్కడ నలిగిపోతుందని టెన్షన్ పడుతున్నారు బయ్యర్లు. పంతానికి పోకుండా ఒక వారం రోజులు ఆగి వచ్చి ఉంటే రజనీకాంత్ కు చాలా థియేటర్స్ వచ్చేవని.. కానీ ఆయన మాట వినకపోవడం పేట సినిమా ఫలితంపై ప్రభావం చూపించేలా కనిపిస్తుంది. మరిది ఏమవుతుందో ఎక్కడ ఆగుతుందో చూడాలి.