మండిపోతుంది ఇక్కడ అంటున్న రజినీకాంత్..

అదేంటి రజనీకాంత్ ఎందుకు అలా ఉంటాడు.. ఆయనకి ఎందుకు మండిపోతుంది అనుకుంటున్నారా.. లేదంటే వరస పరాజయాలు వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా.. అలాంటిదేమీ లేదండి బాబు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పేట తెలుగు ట్రైలర్ విడుదలైంది. రజినీకాంత్ స్టైల్స్ ను ఆధారంగా చేసుకొని ఈ చిత్ర కథ రాసుకున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రజినీకాంత్ ఒక్కడు ఒకవైపు.. మిగిలిన వాళ్లంతా ఒక వైపు అన్నట్లు ఉంది ట్రైలర్. సినిమా నిండా స్టార్స్ కనిపిస్తున్నారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ, సిమ్రాన్, త్రిష, బాబీ సింహ, శశి కుమార్ ఇలా సినిమా నిండా స్టార్ వ్యాల్యూ ఎక్కువగా ఉంది.

అందరిని బ్యాలెన్స్ చేస్తూ పేట సినిమా చేశాడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పటివరకు చేసిన సినిమాలు లో బడ్జెట్ లో తెరకెక్కినవే. కానీ తొలిసారి పూర్తి స్థాయి హై బడ్జెట్ సినిమా చేశాడు కార్తీక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది పేట. ఇన్నాళ్లు పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత తెలుగులో కూడా ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అన్నింటికీ మించి రజిని స్టైల్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇందులో హాస్టల్ వార్డెన్ గా మాఫియా డాన్ గా రెండు పాత్రలలో నటిస్తున్నాడు రజినీకాంత్. కచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతికి సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మరి ఆయన నమ్మకాన్ని పేట ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here