బ్రహ్మానందం సినిమాలకు దూరం కావడానికి అసలు కారణం ఇదే..

ఒకప్పుడు ఏడాదికి 20 సినిమాలు చేసిన బ్రహ్మానందం.. ఇప్పుడు కనీసం రెండు సినిమాలు కూడా చేయడం లేదు. ఈయన తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసి చాలా రోజులు అయిపోయింది. బ్రహ్మానందం రోజులు అయిపోయాయని.. ఈయనకు కామెడీ ఇప్పుడు జనాలు చూడడం లేదు అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. బ్రహ్మానందం సినిమాలకు దూరం కావడానికి అసలు కారణం ఆయన ఫామ్ లో లేకపోవడం కాదు.. ఆరోగ్యం బాగా లేకపోవడం.

Brahmanandam

కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సంక్రాంతి పండగ రోజు వరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో బైపాస్ సర్జరీ జరిగింది. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బ్రహ్మానందంకు ఇప్పుడు ముంబై హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ చేశారు. ఈయన చేయించుకున్న విషయం క్షణాల్లోనే ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది. ఆపరేషన్ జరుగుతున్న టైంలో బ్రహ్మానందం తనయులు గౌతమ్, సిద్ధార్థ అక్కడే ఉన్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పరామర్శించడానికి వెళ్లనుంది. అతనికి ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని చెప్పారు వైద్యులు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం బ్రహ్మానందం వయస్సు 62 సంవత్సరాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here