అర్జున్ రెడ్డి పిల్లతో విశాల్ రెడ్డి పెళ్లి..

విశాల్ పెళ్లికి సమయం దగ్గర పడింది. ఇన్నాళ్లు పెళ్లి ఎప్పుడు.. పెళ్లి ఎప్పుడు అంటే తప్పించుకు తిరిగిన ఈ హీరో ఇప్పుడు సమాధానం ఇచ్చేశాడు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అనీషా రెడ్డితో విశాల్ పెళ్లి జరగబోతుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. మార్చిలో వీళ్ళ వివాహం జరుగుతుంది. త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ తమిళ సినిమా రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నాడు. నడిగర్ సంఘం కోసం ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత తను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విశాల్ ఇప్పుడు అన్నట్లుగానే పెళ్లికి సిద్ధం అవుతున్నాడు.

vishal engaged to anisha alla

ఈయనకు కాబోయే భార్య తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో గ్యాంగ్ లో ఉండే అమ్మాయే అనీషా రెడ్డి. ఈ విషయం చాలామందికి తెలియదు. కాస్త గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. విశాల్ పెళ్లి కి ఒప్పుకోవడంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. వరలక్ష్మి శరత్ కుమార్ తోనే ఈయన పెళ్లి జరుగుతుందని ఆశపడ్డ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైన కూడా చివరికి పెళ్లి పీటలు ఎక్కుతుండటం వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలుగు తమిళ ఇండస్ట్రీ పెద్దల మధ్య విశాల్ పెళ్లి ఘనంగా మార్చిలో జరగబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here