శ్రీ‌నివాస క‌ళ్యాణం అక్క‌డ ఫ్లాప్.. మ‌రిక్క‌డ‌..?

అందుకే ఏ సినిమాపై ఎక్కువ‌గా అంచ‌నాలు పెట్టుకోకూడ‌దు. అలా పెట్టుకుంటే బ్ర‌హ్మోత్స‌వాలు.. అజ్ఞాత‌వాసులే వ‌స్తాయి. ఏ అంచ‌నాలు లేకుండా వెళ్తేనే రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి బ‌య‌టికి వ‌స్తాయి. ఇప్పుడు శ్రీ‌నివాస క‌ళ్యాణంతో ఇది మ‌రోసారి ప్రూవ్ అయింది. ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచ‌నాలున్నాయి.
SRINIVASA KALYANAM FIRST TALK
ఎంత‌లా అంటే ఇప్పుడు అప్పుడు కాదు ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం అనేంత రేంజ్ లో ప్ర‌మోట్ చేసారు.. డ‌బ్బా కూడా కొట్టారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సినిమాపై ఓవ‌ర్ హైప్ వ‌చ్చిన మాట నిజ‌మే అని విడుదల త‌ర్వాత నిర్మాత దిల్ రాజు ఒప్పుకున్నాడు కానీ ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది క‌దా..! అస‌లు విడుద‌ల‌కు ముందు ఈ చిత్రానికి యావ‌రేజ్ టాక్ వ‌స్తుంద‌ని అనుకోలేదు ఎవ‌రూ. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ సినిమాకు టాక్ నెగిటివ్ గా వ‌చ్చేసింది.
అద్భుతంగా ఉంటుంద‌ని వెళ్లిన వాళ్ల‌కు పెళ్లి డివిడి చూపించేస‌రికి షాక్ తిన్నారు. ఓవ‌ర్సీస్ లో ఆలోచించ‌డానికి కూడా లేదు.. అక్క‌డ ఔట్ రేటెడ్ డిజాస్ట‌ర్ అయిపోయింది ఈ చిత్రం. లై.. ఛ‌ల్ మోహ‌న్ రంగా త‌ర్వాత మ‌రో ఫ్లాప్ గా నితిన్ కెరీర్ లో నిలిచిపోయింది. ఇండియాలో ఈ చిత్రం ప‌రిస్థితి ఏంటో తెలియ‌డానికి మ‌రో రెండు మూడు రోజులు ప‌డుతుంది. ఇక్క‌డ ఇంకా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ సినిమాను చూస్తున్నారు. అయితే నైజాంలోనే ఎక్కువ‌గా ఆద‌ర‌ణ వ‌స్తుంది కానీ బ‌య‌ట కాదు. దాంతో ఇక్క‌డ కూడా ఫ‌లితంలో మార్పు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌ద్దాం అనుకున్న నితిన్ కు మ‌ళ్లీ షాక్ త‌ప్పేలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here