కొన్నిసార్లు మాస్ సినిమాలకు ఉండే పవర్ అదే టాక్ ఎంత దారుణంగా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం బాగానే వస్తుంటాయి. ఇప్పుడు వినయ విధేయ రామ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రామ్ చరణ్ ఇమేజ్ ఈ సినిమాకు శ్రీరామరక్షగా మారింది. విడుదలైన ఆరు రోజుల తర్వాత 47 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
తొలి రోజు వచ్చిన టాక్ చూసిన తర్వాత కనీసం 40 కోట్లకు వెళ్తుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి అభిమానుల్లో. కానీ మాస్ ప్రేక్షకులు ఇష్టపడే ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సినిమా బి సి సెంటర్లలో ఇప్పటికీ పర్వాలేదనిపిస్తుంది. నైజాంలో 11 కోట్ల షేర్ దాటింది వినయ విధేయ రామ. ఇంత దారుణమైన టాక్ తో 10 కోట్లు దాటడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఆంధ్ర సీడెడ్ లో కూడా కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు సాధిస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా సీడెడ్లో ఆరు రోజుల్లోనే పది కోట్ల మార్క్ అందుకొని చరణ్ మాస్ పవర్ చూపించాడు. ఇక్కడ భరత్ అనే నేను రికార్డును కూడా దాటేసాడు రామ్ చరణ్. మొత్తానికి ఫుల్ పూర్తయ్యేలోపు వినయ విధేయ రామ 54 కోట్ల షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది. అయితే ఇంత చేసినా కూడా మరో 40 కోట్లు వెనుకబడి ఉంటుంది ఈ చిత్రం. దాంతో డిజాస్టర్ లిస్టు లోకి వెళ్లిపోతుంది వినయ విధేయ రామ.