యాత్ర సెన్సార్ టాక్ అదిరిపోయిందిగా.. వైఎస్ఆర్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. 

ఓ సినిమా విడుదలవుతుంది అంటే దానికి మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు సెన్సార్ పూర్తి చేసుకోవడం మన దర్శక నిర్మాతలకు అలవాటు. కానీ ఇప్పుడు యాత్ర సినిమా మాత్రం విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుంది యాత్ర. మహీ రాఘవ తెరకెక్కించిన ఈ చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్నాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అంచనాలు పెద్దగా లేవు కానీ ఒక్కొక్క విజువల్, పోస్టర్ విడుదల అవుతున్న కొద్ది సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత సాధారణ ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం వేచి చూడడం మొదలుపెట్టారు.
yatra censor report
yatra censor report
ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల సమయంలో యాత్ర సినిమాను త‌మ‌కు ప్రచారాస్త్రంగా భావిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర అదే సమయంలో జగన్ పాదయాత్ర చేయడం కచ్చితంగా తమ పార్టీకి లాభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇక యాత్ర సినిమాకు సెన్సార్ టాక్ కూడా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా వైఎస్ పాదయాత్ర చేయడానికి గల కారణాలను ఇందులో స్పష్టంగా చూపిస్తున్నాడు మహీ రాఘవ. ఇవన్నీ ప్రేక్షకులకు కరెక్ట్ అవుతాయని మరోసారి ఆ మహానాయకుడుని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి వీళ్ళ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో ఫిబ్రవరి 8న యాత్ర సినిమా విడుదలైన తర్వాత తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here