ఎన్టీఆర్ కు సవాల్ విసురుతున్న వైయస్సార్..

కొన్ని సినిమాలపై మొదలు పెట్టినప్పుడు ఎలాంటి అంచనాలు ఉండవు.. కానీ అవి పూర్తయిన తర్వాత మాత్రం భారీ అంచనాలతో విడుదలవుతుంటాయి. ఇప్పుడు యాత్ర సినిమా ఇదే కోవలోకి వస్తుంది. మమ్ముట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని మహీ రాఘవ తెరకెక్కించాడు. వైఎస్ఆర్ బయోపిక్ గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా యాత్ర సినిమాపై వైఎస్సార్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ నేతలు కూడా ఈ సినిమా తమకు ఎన్నికల ప్రచార అస్త్రంగా పనికి వస్తుందని భావిస్తున్నారు.

yatra censor report

ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మహీ రాఘవ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ కోణం లేదంటూనే తెలుగుదేశంకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ సినిమా థియేటర్లు దద్దరిల్లి పోవాలి.. ఇడుపులపాయలో అరిస్తే అమరావతిలో ఉన్న వాళ్లు నిద్రలేవాలి అంటూ సెటైర్లు వేసాడు మహి. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నారు ఈయన. మమ్ముట్టి కూడా కచ్చితంగా తెలుగులో ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంటానంటున్నాడు. వైఎస్ఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అంటున్నాడు మమ్ముట్టి. మొత్తానికి ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వాటిని యాత్ర సినిమా ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here