అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెదవలవుతారు!

 

మహేష్ కత్తి మరో రామ్ గోపాల్ వర్మల తయారయ్యారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను వారి ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ తరచూ ఇదొక కామెంట్ చేసి వివాదాలు లేపే వాడు ఆర్.జి.వి. లక్ష్మి’స్ ఎన్టీఆర్ అంటూ కొత్త వివాదం దొరకగా పవన్ ను వదిలేసినట్లున్నాడాయన. అయితే వర్మ అభిమానిని అని చెప్పుకొనే చిత్ర విమర్శకుడు మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ చిత్రాలను, రాజకీయ పంథాను విమర్శిస్తూ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవి చూసాడు. ఇటీవలే కత్తి మీద జబర్దస్త్ షో లో హైపర్ ఆది సెటైరులు, పంచ్ డైలాగులు వేస్తే దానికి ఘాటుగా స్పందిస్తూ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా అదే హైపర్ ఆది తో నవ్వుతూ ఫోటో దిగి పోస్ట్ చేసాడు కత్తి. అంతటితో ఆగకుండా పవన్ తో కూడా ఇలాగె నవ్వుతూ ఫోటో దిగి పెడతా అప్పుడు ఫ్యాన్స్ ఎదవలవుతారు అని సంచలన వ్యాఖ్య చేసాడు. “కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు. మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్ ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెదవలు అయ్యేది మీరే!” అని కత్తి తన సామజిక మధ్యమ ఖాతా లో రాసారు.