పవన్ కు తాత కానీ అల్లు అర్జున్ కు మాత్రం తండ్రి..

త్రివిక్రమ్ ఒక నటుడికి ఫిక్స్ అయ్యాడంటే ఆయన్ని అంత ఈజీగా వదిలిపెట్టడు. ప్రతి సినిమాలో రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. తాజాగా అల్లు అర్జున్ తో ఈయన తెరకెక్కిస్తున్న చిత్రంలో మరోసారి బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కీలకపాత్రలో నటించబోతున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ తాతగా చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత కూడా వరుసగా తన తెరకెక్కిస్తున్న సినిమాల్లో బోమన్ ఇరానీని కంటిన్యూ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించబోయే సినిమాలో హీరో తండ్రి పాత్రలో బోమన్ ఇరానీ తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. విచిత్రంగా పవన్ కళ్యాణ్ కు తాతగా నటించిన నటులు తీసుకొచ్చి అల్లు అర్జున్ కి తండ్రిని చేయడం మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలు కానుంది. ఇందులో హీరోయిన్లుగా రష్మికతోపాటు ప్రియా వారియర్ కూడా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో మాటల మాంత్రికుడు ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here