వరుణ్ తేజ్ తొలి ప్రేమకు ఊహించని షాక్..

సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర విజయంతో గాల్లో తేలిపోతున్న వరుణ్ తేజ్ కు ఊహించని షాక్ ఎదురయింది. ఈయన నటించిన తొలిప్రేమ సినిమా ఈ మధ్య టీవీలో వచ్చింది. ఏడాది తర్వాత ఈ సినిమా బుల్లి తెరపై కనిపించింది. సంక్రాంతికి భారీ పోటీ మధ్య టీవీ స్క్రీన్ పై కనిపించిన తొలిప్రేమ ఊహించిన రేటింగ్ తెచ్చుకోలేకపోయింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు వచ్చిన రేటింగ్ కు ఎక్కడ పొంతన లేదు. 6.2 టిఆర్పి రేటింగ్ తో సరిపెట్టుకుంది తొలిప్రేమ. వరుణ్ తేజ మార్కెట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ రేటింగ్.

Tholiprema

 

గతంలో ఆయన నటించిన సినిమాలకు ఇంతకంటే భారీ టిఆర్పి వచ్చింది. కానీ విడుదలైన ఏడాది తర్వాత టీవీలో రావడం ఇప్పటికే ఒరిజినల్ ప్రింట్స్ కూడా వచ్చేయడంతో తొలిప్రేమకు ఊహించిన దాని కంటే చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. కేవలం ఆరు టిఆర్పి రేటింగ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ చిత్రం. విడుదలైన కొత్తలోనే టీవీలో వచ్చే కచ్చితంగా తొలిప్రేమ రికార్డులు సృష్టించేదని నమ్ముతున్నారు అభిమానులు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 23కోట్ల వసూలు చేసింది. వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ ఈ సినిమాకు పాజిటివ్ గా మారింది. మొత్తానికి తొలిప్రేమ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసినా కూడా టీవీ లో మాత్రం తోకముడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here