అప్పుడే అమెజాన్ లో వచ్చేస్తున్న ఎఫ్2..

ఎఫ్ 2 సినిమా థియేటర్లలో ఇంకా వసూళ్లు తీసుకొస్తూనే ఉంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 130 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నాలుగో వారం కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇలాంటి సమయంలో ఈ చిత్రంలో విడుదలవుతుంది. థియేట్రికల్ కలెక్షన్లు ఇంకా వస్తున్న సమయంలోనే సినిమాలో అమెజాన్ లో విడుదల చేయనుండడం ఆసక్తికరంగా మారింది.

అమెజాన్ కు డీల్ కుదుర్చుకున్నప్పుడే నెల రోజుల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తాం అంటూ దిల్ రాజు ఒప్పందం. దాంతో ఇప్పుడు అనుకున్నట్లుగానే నెల రోజుల్లోనే ఎఫ్ 2 సినిమా ఒరిజినల్ ప్రింట్ అమెజాన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ లో విడుదల కానుంది. థియేటర్లలో చూడడం మిస్ అయిపోయిన ప్రేక్షకులకు ఇది ఒక సువర్ణావకాశం. అయితే కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి మరో రెండు వారాలు వసూలు తీసుకొచ్చే సత్తా ఉంది. కానీ అప్పుడే అమెజాన్ లో విడుదలవుతుండడంతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు పది కోట్ల వరకు నష్టాలు తప్పవు. ఇప్పటికే వాళ్లకు దాదాపు 50 కోట్లు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మరొక 10 కోట్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నా కూడా అమెజాన్ వాళ్ళ ఆశలను అడియాశలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here