ఆచారి అమెరికా యాత్ర భారీ షెడ్యూల్ పూర్తి

విష్ణు మంచు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం ముఖ్య తారాగణం గా వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలేషియా మరియు హైదరాబాద్ లో రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, తాజా గా అమెరికాలో షూటింగ్ పూర్తి చేసుకొని చిత్రం బృందం హైదరాబాద్ చేరుకున్నారు.

Achari America Yatra Finished Massive USA Schedule
“ఆధ్యంతం కామెడీ ప్రధానం గా సాగే చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం  తరహాలో విష్ణు చేస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా అమెరికా షూటింగ్ చేసాము,” అన్నారు దర్శకుడు. “దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఇదివరకటి చిత్రాలవలె ఆచారి అమెరికా యాత్ర కూడా ప్రేక్షకుల పై నవ్వుల జల్లు కురిపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు నిర్మాతలు కీర్తి చౌదరి మరియు కిట్టు.

ఇతర తారాగణం:

తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, ఎల్ బి శ్రీరామ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, అనూప్ ఠాకూర్ సింగ్
సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: శేఖర్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
మాటలు: డార్లింగ్  స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : సెల్వ
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్
సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి
నిర్మాతలు: కీర్తి  చౌదరి , కిట్టు
స్క్రీన్ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి