చిత్రీకరణ పూర్తి చేసుకొన్న “రచయిత”, నేడు ఫస్ట్ లుక్ విడుదల మొదటిసారి సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్న స్టార్ హీరో

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న మరో ప్రతిభాశాలి విద్యాసాగర్ రాజు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం “రచయిత”. దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ లుక్ ఇటీవల విడుదలై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేయగా.. నేడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

RACHAYITHA Shooting Finished - Teaser, Release Date Soon
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ.. “స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. భయం అనేది మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదు, ఎలా ఇన్ఫ్లూయన్స్ చేయగలదు అనేది ప్రధాన కథాంశం. 1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ప్రొడక్షన్ వేల్యూస్ తో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా-దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇకపోతే.. మా సినిమాకి ఒక స్టార్ నటుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. సినిమాకి బ్రాండ్ షిప్ చేయడం అనేది ఇదే మొదటిసారి” అన్నారు.
విద్యాసాగర్ రాజు, సంచితా పడుకోనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర, అభిలాష్, రాగిణి, సంజిత్, సుప్రియా, అన్మోన, అనిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కళ: రాము, సంగీతం: షాన్ రెహమాన్, నేపధ్య సంగీతం: జీవన్.బి, మాటలు: కరుణాకర్ అడిగర్ల, పాటలు: చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, నిర్మాణం: దుహర మూవీస్, నిర్మాత: కళ్యాణ్ ధూలిపల్ల, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు.