జగన్ కు షాక్ ఇచ్చిన రోజా

 

YSRCP MLA Roja eyes Home Ministry

వై.ఎస్.ఆర్.సి.పి  ఎం.ఎల్.ఏ రోజా తెలుగు దేశం నేతలతో వాగ్వివాదాలతో, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ను దూషిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎంతమంది నేతలున్నా,  జగన్ తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి  లో గుర్తుకొచ్చే పేరు రోజా అనే చెప్పాలి.

తాజాగా తన మనసులోని మాటను బైట పెట్టింది రోజా, 2019 ఎన్నికల లో విజయం తమ పార్టీదేనని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పారు, తనకు ఏ భాద్యతనిచ్చిన స్వీకరిస్తానని కూడా అన్నారు రోజా.

అంతటి తో ఆగ కుండా, హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన సక్రమంగా, భాద్యతాయుతంగా నిర్వర్తిస్తానని పలికారు రోజా. ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ ఉన్నది హోముకే అన్న విషయం తెలిసిందే. మొత్తం పోలీస్ యంత్రాంగం హోమ్ చేతిలోనే ఉంటుంది. పెద్ద పదవి కె కన్ను వేసింది రోజా. మరి వై.ఎస్.ఆర్.సి.పి లో తల పండిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.