టి.ఆర్.ఎస్ ఆపరేషన్ రేవంత్ ప్రారంభం

పార్టీ ని పైకే లేపగలిగే బాహుబలి గా రేవంత్ రెడ్డి ని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 2019 ఎలక్షన్ నాటికి  బలమైన నేతగా అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ ను ముందుచాలని భావిస్తున్నారు కాంగ్రెస్ వారు.
KTR Plans to counter Revanth Reddy
అయితే ఎప్పటినుండి పార్టీ లో పాతుకొనిపోయి ఉన్న వృద్ధ నేతలు మాత్రం తమను కాదని రేవంత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటిస్తే వాక్అవుట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ విషయాన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టారట. మరో వైపు తెలంగాణ మంత్రి , తెరాస నేత కె.టి.ఆర్ కూడా రేవంత్ ను గట్టి ప్రత్యర్థి అవుతాడన్న  భయం ఉన్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.
అందుకే రేవంత్ టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరగానే ట్ ఆర్ ఎస్ వారు రేవంత్ పై దాడి మొదలుపెట్టారు. తాజాగా కె టి ఆర్ రేవంత్ కు చెక్ పెట్టేందుకు ఓ ప్రణాళిక సిద్దంచేసినట్లు ఉన్నారు. కొడంగల్ నియోజక వర్గం లో లోకల్ నేతలతో కే టి ఆర్ సమావేశమైనట్లు సమాచారం. టిఆర్ ఎస్ లో చేరమని బారి బహుమానాలతో ప్రలోభపెడుతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ పథకం సక్సెస్ అయితే, మరిన్ని జిల్లాలో రానున్న రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించాలని భావిస్తున్నారట టి ఆర్ ఎస్ బాబులు.