తమన్నా హీరోయిన్ గా బాలీవుడ్ చిక్కడు దొరకడు!

tammanna in bollywoodd chikkadu doraakadu

తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ తెలుగు రీమేక్ లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పారిస్ జో జరుగుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో తమన్నా నటించడం ఇదే మొదటిసారి. వివాహం రద్దయిన ఓ పెళ్లికూతురు ఒంటరి గా హనీ మూన్ కి వెళ్తే ఎలావుంటుందనేదే ఈ చిత్ర కథ. హిందీ లో కంగనా రనౌత్ కు నేషనల్ అవార్డు వచ్చింది. ఇది ఇలా ఉండగా, తమన్నా మరో రీమేక్ చిత్రం చేయబోతోందని సమాచారం. తమిళం లో సిద్ధార్థ్ ముఖ్య పాత్రా లో వచ్చిన జిగర్తాండ మంచి విజయం సాధించింది. తెలుగులో ‘చిక్కడు దొరకడు’ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని హిందీ లో అజయ్ దేవగన్ నిర్మించనున్నారు. తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో అజయ్ దేవగన్ సరసన తమన్నా హిమ్మత్వాల అనే చిత్రంలో నటించింది