పద్మ కోసం షూటింగ్ మానేసిన నటుడు!

Comdian trying for Padma Bhushan
పద్మ అవార్డుల కోసం డిల్లీలో పైరవీలు మొదలైనట్లు సమాచారం. రాష్ట్రంనుండి పీవీ సింధు ను పద్మ భూషణ్ కు ప్రతిపందించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హాస్య నటుడి కూడా పద్మ భూషణ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన ఆయన, గత కొంత కలం గా యువ కమెడియన్ల జోరుకు వెనుక బడ్డారు. మంచి పాత్రతో తిరిగి పూర్వ వైభవానికి తిరిగి రావాలని చూస్తుండగా, రాబోవు ఓ మంచి కమర్షియల్ కామెడీ చిత్రంలో సదరు హాస్యనటుడికి అవకాశం వచ్చింది. ఆయనకు పెట్టింది పేరైన పురోహితుడు పాత్ర అది.
చిత్ర హీరో కంబినేషన్లో ఈ హాస్యనటుడికి మంచి హిట్లు ఉన్నాయి. చాలావరకు అమెరికాలో తీయబడిన ఈ చిత్రం ఇటీవలే తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకాగా. షూటింగ్ కు నామం పెట్టి సదరు హాస్య నటుడు ఢిల్లీ కి వెళ్లి పద్మ భూషణ్ కోసం లాబీయింగ్ చేస్తున్నారట. షూటింగ్ కాన్సుల్ కావడంతో  ఆ చిత్ర నిర్మాతలు  నష్టాలు చవిచూడాల్సి వస్తుందని లబోదిబో మంటున్నారట.