ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగా స్టార్ తో చిందేయనున్న అమీర్ ఖాన్

 Prabhu Deva To Choreograph For Thugs of Hindostan

 డ్యాన్స్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా దర్శకుడు గా మారినప్పటి నుండి పెద్దగా డాన్స్ కొరియోగ్రఫీ చేయటం లేదు. కొంతమంది పెద్ద హీరోలకు అడపా తడపా డ్యాన్స్ డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. తగ్స్ అఫ్ హిందుస్తాన్ చిత్రం కోసం ఓ పాటలో డ్యాన్స్ వేయనున్న బిగ్ బి కోసం ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేయనున్నాడట. చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమీర్ ఖాన్ కూడా ఆ పాటలో చిందేయనున్నాడట. కత్రినా కైఫ్ మరియు ఫాతిమా సనా ఖాన్ (దంగల్ లో అమీర్ కూతురు గా వేసిన అమ్మాయి)  తగ్స్ అఫ్ హిందుస్తాన్ లో హీరోయిన్లు.