రజినీకాంత్ 2.0 ఆడియో ఈవెంట్ టికెట్ ఎంతో తెలుసా?

రజినీకాంత్ రోబో 2 .0 ఆడియో లాంచ్ కు రంగం సిద్దమయ్యింది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఆడియో లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 27 న జరగనుంది. భారీ స్థాయి లో జరగనున్న ఈ ఫంక్షన్ కు టికెట్ రేట్ లు కూడా భారీగానే పలుకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఒక్కో టిక్కెట్టు అరవై వేలు వరకు అమ్ముతున్నారట. సూపర్ స్టార్ ఫ్యాన్స్ టిక్కెట్లను ఎంత పెట్టైనా దక్కించుకో దానికి పోటీ పడుతున్నారట. ఆడియో ఈవెంట్ కు ముందు రోజు అంటే అక్టోబర్ 26 న బుర్జ్ అల అరబ్ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించ బోతున్నారు, ఇందులో చిత్ర బృందం మొత్తం పాల్గొంటారు. రజినీకాంత్ రోబో గా కనిపించబోయే ఈ చిత్రాన్ని శంకర్ అంతర్జాతీయ హంగులతో సుమారు 400 కోట్లు వెచ్చించి భారీగా తీయగా, 100 కోట్లు గ్రాఫిక్స్ కె ఖర్చుబెట్టారని టాక్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విల్లన్ గా నటిస్తుండగా అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. సంగీతం ఏ ఆర్ రెహమాన్ సమకూర్చారు.