వర్మ కోసం కొత్త హీరోయిన్ ల వేట!

Heroines audition for Arjun Reddy remake Varma

 

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో హీరో గా చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ కృష్ణ ను  పరిచయం చేయనున్నాడు. ఈ చిత్రానికి వర్మ అనే టైటిల్ ను ఖరారు చేసారు. రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తి తోనే చిత్రానికి వర్మ అనే పేరు పెట్టి ఉండవచ్చని అందరు అనుకుంటున్నారు. విక్రమ్ తో శివపుత్రుడు తీసిన బాల ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ రీమేక్ లో నటించేందుకు కొత్త అమ్మాయిల కోసం వేట ప్రారంభించారు. ఉత్సాహవంతులైన అమ్మాయిలు ఆడిషన్స్ కు పిలుస్తూ చియాన్ విక్రమ్ ఓ వీడియో షేర్ చేసాడు.  ఆ వీడియో లో ముఖ చూపించకుండా ఓ అమ్మాయి బీచ్ లో పరిగెడుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే రాగం శృతి హాసన్ ఆలపించారు. అర్జున్ రెడ్డి లో నటించిన షాలిని పాండే కు మంచి పేరు వచ్చింది. ఆమె ప్రస్తుతం తమిళం లో 100 % లవ్ రీమేక్ మరియు మహానటి లో నటిస్తుంది.

 

A post shared by Vikram (@the_real_chiyaan) on