శివాజీ రాజా ముఖ్య పాత్రలో `అమ్మాయిలంతే..అదో టైపు`

అమ్మాయిల లొని  ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను,  తండ్రి తనయల రిలేషన్ హైలెట్ చెస్తూ దర్శ కుడు కృష్ణమ్ రూపొందిస్తొన్న చిత్రం `అమ్మాయిలంతే ..అదోటైపు`  . గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై  ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లొ విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు కృష్ణమ్ మాట్లాడుతూ..
  sivaji raja in the main lead his upcoming movie ammailu antha adho type
 తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఓ కూతురు ,తన తండ్రి ప్రేమ‌కు దూర‌మ‌వు తుంది. అప్పుడు ఆ అమ్మాయి,  తండ్రి ప్రేమకి దూరమయ్యానని పడే బాధ, ఆ తరువాత జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సీనియర్ నటులు శివాజీ రాజా మా చిత్రంలొ ప్రధాన పాత్రను పోషించారు . మా అధ్యక్షులుగా భాద్యాతాయుతమైన పదవిని నిర్వహిస్తున్న రాజా గారు.. మా చిత్రంలొ అంతే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో నటిస్తున్నారు.మిగతా
న‌టీనటులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. త్వరలోనే ఆడియోవిడుద‌ల చేసి, డిసెంబర్ లొ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.
గోపి వర్మ‌, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా, సాయి, భ‌ద్ర‌మ్‌, వేణుగోపాల్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్‌, కూర్పు: గోపి సిందమ్
సాహిత్యంః పూర్ణాచారి,  ద‌ర్శ‌కత్వంః కృష్ణ‌మ్.