సుమంత్ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న  హీరో అక్కినేని సుమంత్. ఆయన  హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.
sumanth new movie on tracks
విరాట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమాల సంయుక్త నిర్మాణంలో ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజు కురియన్ నాయికగా నటించనుంది. అనీల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ  సుమంత్ కెరీర్‌లో వైవిధ్యమైన నిలిచిపోయే చిత్రమిది. క్రైం థిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలైట్‌గా వుంటుంది.
ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా.. అందర్నీ అలరించేవిధంగా వుంటుంది. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వైజాగ్,అరకు కేరళలో చిత్రీకరణ చేస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు. మురళీ శర్మ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, మాటలు: చంద్రశేఖర్, సంగీతం: శ్రీచరణ్, నిర్మాతలు:  ఆలూరు సాంబశివా రెడ్డి, గంగపట్నం శ్రీధర్, రచన-దర్శకత్వం: అనీల్ శ్రీకంఠం