హీరో విష్ణు మంచు జన్మదినం సందర్భంగా విడుదల కానున్న‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర ఫస్ట్ లుక్

విష్ణు మంచు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర ఫస్ట్ లుక్
విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది.

First Look Of ‘Achari America Yatra’ To Be Unveiled On Hero Vishnu Manchu’s Birthday!

‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి వినోదభరిత కామెడీ చిత్రాలను అందించిన విష్ణు మంచు, జి. నాగేశ్వర్ రెడ్డిలు మళ్ళి జత కట్టడంతో ‘ఆచారి అమెరికా యాత్ర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 23 న విడుదల చేస్తామని వెల్లడించారు నిర్మాతలు. ఆడియో మరియు ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

ఇతర తారాగణం:
కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సుప్రీత్, రాజా రవీంద్ర తదితరులు

సాంకేతిక వర్గం:
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్
ఎడిటింగ్: శేఖర్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
మాటలు: డార్లింగ్  స్వామి
ఆర్ట్ : కిరణ్
యాక్షన్ : సెల్వ
బ్యానర్ : పద్మజ  పిక్చర్స్
సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి
నిర్మాతలు: కీర్తి  చౌదరి , కిట్టు
స్క్రీన్ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి