అర‌వ సంక్రాంతికి సినిమాల మేళ‌.. 

మ‌న ద‌గ్గ‌రే కాదు.. త‌మిళ సంక్రాంతి కూడా సినిమాల‌తో ఫుల్లుగా నిండిపోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌ర‌స సినిమాలు పోటీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో విక్ర‌మ్, సూర్య లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. పైగా వీళ్ళంతా ఒకేసారి పోటీకి సై అంటున్నారు. జ‌న‌వ‌రి 12న సూర్య న‌టించిన తాన సేరంద కూట్టం విడుద‌ల కానుంది. ఈ చిత్రం తెలుగులో గ్యాంగ్ పేరుతో రానుంది. ఇక అదేరోజు విక్ర‌మ్ న‌టించిన స్కెచ్ విడుద‌ల కానుంది. ఈ చిత్రంపై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి త‌మిళ‌నాట. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రం విడుద‌ల కావ‌డం లేదు. జ‌న‌వ‌రి 12నే రానున్న మ‌రో సినిమా అర‌వింద్ స్వామి భాస్క‌ర్ ఒరు రాస్కెల్. ఇందులో అమలాపాల్ హీరోయిన్. మ‌ళ‌యాలం బ్లాక్ బ‌స్ట‌ర్ భాస్క‌ర్ ది రాస్కెల్ కు ఇది రీమేక్. ఇక పొంగ‌ల్ కే రాబో తున్న మ‌రో సినిమా గులేభ‌కావ‌ళి. ప్ర‌భుదేవా ఇందులో హీరో. జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం విడుద‌ల కానుంది. పొంగ‌ల్ కే మ‌ధుర‌వీర‌న్.. క‌ళ‌క‌ళ‌ప్పు 2 లాంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వ‌స్తున్నా కూడా అంద‌రి చూపు సూర్య తాన సేరంద కుట్టంపైనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here