ఎంత‌కాలం చూపిస్తావ్ కృతి..?


ఎప్పుడూ ఒక్క‌టే ప‌నా..? ఇంకో ప‌నేది లేన‌ట్లుగా ఎప్పుడూ అందాలు ఆర‌బోస్తూనే ఉండాలా..? న‌ట‌న‌తో బిజీగా ఉన్నా కూడా అది ప‌క్క‌న‌బెట్టి మ‌రీ ఎప్పుడూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉండాలా..? అలా చేయ‌క‌పోతే ప్రేక్ష‌కులు మ‌రిచిపోతారా..? ఇప్పుడు కృతిక‌ర్భందాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కినిలా ఇప్ప‌టికీ స్టార్ కావాల‌ని ట్రై చేస్తూనే ఉంది పాపం.
తెలుగులో ఎలాగూ అదృష్టం క‌లిసి రాలేదు. ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్స్ తో న‌టించినా లాభం లేకుండా పోయింది.ఓటమి ఒప్పుకోకని ఎవ‌రో మ‌హానుభావుడు చెప్పిన‌ట్లుగా ఎక్క‌డ ఛాన్స్ ఉంటే అక్క‌డ దూరిపోతుంది కృతి. ఇప్పుడు కృతి ముందున్న ఏకైక ల‌క్ష్యం అందాల ఆర‌బోత‌. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికీ హాట్ ఫోటోషూట్ల‌తో ర‌ప్ఫాడిస్తుంది కృతి.
ప్ర‌స్తుతం హౌజ్ ఫుల్ 4లో న‌టిస్తూ బిజీగా ఉన్న కృతి.. మ‌ధ్య‌లో మ‌రోసారి ఫోటోషూట్ చేసింది. ఇందులో నిండుగా క‌ప్పుకున్న‌ట్లే క‌నిపించినా.. ఎక్క‌డెక్క‌డ ఏయే అందాలు క‌నిపించాలో అవి మాత్రం కెమెరాకు వ‌దిలేసింది కృతి. మొత్తానికి ఏదో మాయ చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది ఈ క‌న్న‌డ క‌స్తూరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here