చేతులు మారుతున్న దాగుడుమూత‌లు..

పాపం ఏ ముహూర్తంలో దాగుడుమూత‌లు అని టైటిల్ పెట్టుకున్నాడో కానీ అప్ప‌ట్నుంచీ హ‌రీష్ శంక‌ర్ కు ఇదే మిగిలింది. క‌థ‌.. ద‌ర్శ‌కుడు.. అంతా సిద్ధంగా ఉన్నా కూడా ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. ఇక దాగుడుమూత‌లు ఆగిపోయిన‌ట్లే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం సినిమా ఉంది.. కానీ అందులో హీరోలు మాత్రం వాళ్లు కాద‌ని తెలుస్తుంది. నితిన్, శ‌ర్వానంద్ ల‌ను కాద‌ని.. ఇప్పుడు త‌న‌కు అచ్చొచ్చిన హీరో ల‌తోనే ఈ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.
harish-shankar
ఈయ‌న‌కు మెగా హీరోలు బాగానే క‌లిసొచ్చారు. ప‌న్నెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆక‌లి తీర్చిన ద‌ర్శ‌కుడిగా ఈయ‌న‌కు గుర్తింపు ఉంది. గ‌బ్బ‌ర్ సింగ్ తో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు హ‌రీష్. ఆ త‌ర్వాత కూడా వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకున్నాడు. ముఖ్యంగా మెగా హీరోల‌కు ఈ ద‌ర్శ‌కుడు బాగానే క‌లిసొచ్చాడు. మిర‌ప‌కాయ్ త‌ర్వాత ప‌వ‌న్ కు గ‌బ్బ‌ర్ సింగ్ ఇచ్చాడు.. ఆ త‌ర్వాత సాయిధ‌రంతేజ్ కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇచ్చి క్రేజ్ పెంచేసాడు.
ఇక ఆ త‌ర్వాత అల్లుఅర్జున్ తో దువ్వాడ జ‌గ‌న్నాథమ్ చేసాడు. ఈ చిత్రం హిట్ కాక‌పోయినా 70 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. క‌మ‌ర్షియల్ డైరెక్ట‌ర్ గా హ‌రీష్ శంక‌ర్ కు తిరుగులేదు. ఒక్క సినిమాతో ఇమేజ్ మార్చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు. దాగుడుమూతలు సినిమా ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాల్సి ఉన్నా ఇంకా కాలేదు. నితిన్, శ‌ర్వానంద్ ఇప్పుడు ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు.
దాంతో ఇదే క‌థ‌ను సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ ల‌తో చేయ‌బోతున్నాడు హ‌రీష్. దీనిపై ఈ ద‌ర్శ‌కుడు కూడా ఇప్ప‌ట్లో ఏ ప్ర‌క‌ట‌న చేయ‌ట్లేదు. అంతేకాదు.. హీరోలే కాదు నిర్మాత‌ కూడా మారిపోయిన‌ట్లే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ముందు దిల్ రాజు నిర్మిస్తాన‌ని చెప్పినా.. ఇప్పుడు 14 రీల్స్ ద‌గ్గ‌రికి వెళ్లింద‌ని తెలుస్తుంది. మ‌రి క‌నీసం ఇప్ప‌టికైనా ఈ చిత్రానికి మోక్షం వ‌స్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here