తొట్టిగ్యాంగ్.. భ‌లే పోజిచ్చారే..!

నాలుగు కొప్పులు ఒక ద‌గ్గ‌ర ఉండ‌లేవు.. రెండు క‌త్తులు ఒకే ఒర‌లో దూర‌లేవు అని తెలుగులో చాలా సామెత‌లు ఉన్నాయి క‌దా… కానీ ఇప్పుడు కొంద‌రు హీరోయిన్ల‌ను చూస్తుంటే మాత్రం ఇది అబ‌ద్ధం అనిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు కాలేక‌పోయినా.. ఎప్పుడు క‌లిసినా క‌లిసి కాల‌క్షేపం చేస్తుం టారు వాళ్లు. ఇప్ప‌టికీ మంచి స్నేహితుల్లాగే ఉన్నారు. ఎక్క‌డ క‌లిసినా ఆనందంగా హ‌గ్గులు ఇచ్చుకుంటారు. ఒక్కొక్క‌రు ఒక్కో ఇండ‌స్ట్రీలో బిజీగా ఉన్నా.. ఏదో ఓ టైమ్ లో త‌మ గ్యాంగ్ తో ర‌చ్చ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి సీనే క‌నిపించింది. కృతిక‌ర్బాందా.. షాన్వి.. ప్ర‌ణీత‌.. అదా శ‌ర్మ‌.. వీళ్ల‌లో ఏ ఒక్క‌రు కూడా స్టార్ హీరోయిన్ కాదు.. అలాగ‌ని చిన్న హీరోయిన్లు కూడా కాదు.
అంద‌రికీ తెలిసిన మొహాలే. సెకండ్ గ్రేడ్ లిస్ట్ లోకి వ‌చ్చే ఈ ముద్దుగుమ్మ‌లంతా చాలా మంచి స్నేహితులు. స్టార్ హీరోయిన్ల‌తో వీళ్ళ దోస్తానా ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ తాము మాత్రం అంతా క‌లిసే ఉంటాం అని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ తొట్టిగ్యాంగ్ అంతా క‌లిసి భ‌లే పోజిచ్చారు. ఈ ఫోటో వైర‌ల్ అవుతుందిప్పుడు. అంతా క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తారు కాబ‌ట్టి అక్క‌డే కామ‌న్ ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఇప్పుడు కృతికి బాలీవుడ్ లో ఆఫ‌ర్లు పెరిగిపోయాయి. అక్క‌డ య‌మ్లా ప‌గ‌లా దివానా సిరీస్.. హౌజ్ ఫుల్ 4లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎవ‌రెంత బిజీగా ఉన్నా ఇలా అప్పుడ‌ప్పుడు క‌లుస్తుండ‌టం మాత్రం అద్భుత‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here