మ‌న జేమ్స్ బాండ్ పిచ్చెక్కించాడు..

goodachari
మ‌న జేమ్స్ బాండ్ ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ఇప్పుడు వ‌చ్చాడుగా గూఢ‌చారి 116. క్ష‌ణం త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మ‌రో సినిమాతో వ‌చ్చాడు అడ‌విశేష్. ఇన్నాళ్లూ ఈయ‌న సినిమా వ‌స్తుందంటే త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం కాదు.. అస‌లు అంచ‌నా వేయ‌డ‌మే త‌క్కువ అనుకునేవాళ్లు.
కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. క్ష‌ణంతోనే మ‌నోడు ఇండ‌స్ట్రీకి హింట్ ఇచ్చాడు. త‌ను ఒక‌డిని ఉన్నాన‌ని. అప్పుడు కూడా ఈ హీరో గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.
ఇప్పుడు మ‌రోసారి గూఢ‌చారి అంటూ వ‌చ్చేసాడు. ఈ సినిమా కూడా అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. ప‌క్కా స్క్రీన్ ప్లే ప్ల‌స్ అదిరిపోయే రైటింగ్ తో అడ‌విశేష్ మాయ చేసాడు. త‌న‌లో న‌టుడితో పాటు ఇంకా చాలా కోణాలున్నాయ‌ని మ‌ళ్లీ నిరూపించుకున్నాడు. జేమ్స్ బాండ్ సినిమాల త‌ర‌హా ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించినా.. మ‌న‌కు న‌చ్చేట్లుగానే క‌థ రాసుకున్నాడు అడ‌విశేష్. ఇక అభిషేక్ పిక్చ‌ర్స్ ఇచ్చిన 4 కోట్ల‌తోనే ఇంత క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వ‌డం అద్భుత‌మే. ఈ సినిమా త‌ర్వాత అడవిశేష్ ను ఆంధ్రా జేమ్స్ బాండ్ అంటారేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here