విజ‌య్ సిఎం అవుతున్నాడా..?

Vijay Deveraokonda
తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ ట్రెండ్ ఉంది. ఒక్కో సీజ‌న్ లో ఒక్కో క‌థ‌కు బాగా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పొలిటిక‌ల్ జోన‌ర్ టైమ్ న‌డుస్తుంది. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న క‌థ‌లు ఇప్పుడు తెలుగులో చాలానే వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో భ‌ర‌త్ అనే నేను.. ఎమ్మెల్యే సినిమాల్లో కూడా ఇదే జ‌రిగింది. ఇప్పుడు పంతం సినిమాలో కూడా గోపీచంద్ టార్గెట్ చేసింది రాజకీయ నాయ‌కుల‌నే. ఇప్పుడు మ‌రో హీరో కూడా ఇదే చేయ‌బోతున్నాడు.
ఏకంగా ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబోతున్నాడు. అత‌డే విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈయ‌న ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ సినిమా కూడా చేస్తున్నాడు. అదే నోటా. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తుంది. సామాన్యుడు ఎలా రాజ‌కీయాల‌పై పోరాడాడు అనేది క‌థ‌. ఇందులో విజ‌య్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.
ఈ చిత్రంలో కామ‌న్ మ్యాన్ రాజ‌కీయ నాయ‌కులు చేస్తోన్న అన్యాయాల‌పై పోరాడి ఎలా తానే ఓ సిఎం అయ్యాడు అనేది క‌థ‌. ముఖ్య‌మంత్రిగా ఇప్ప‌టికే రానా.. మ‌హేశ్ తమ స‌త్తా చూపించారు. భ‌ర‌త్ అనే నేనులో ప‌ర్ ఫెక్ట్ సిఎం అంటే ఎలా ఉండాలో చూపించాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు విజ‌య్ దేవ‌రకొండ కూడా ఇదే చేయ‌బోతున్నాడు మ‌రి చూడాలిక‌.. ఈయ‌న రాజ‌కీయాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here