చిరంజీవి రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా వేచి చూసారో తెలియదు కానీ నిర్మాతలు మాత్రం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూశారు. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే కలెక్షన్లు ఎలా వస్తాయో వాళ్లకు కూడా బాగా తెలుసు. పదేళ్ల తర్వాత వచ్చి కూడా 100 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక హీరో చిరంజీవి. అంతేకాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ లో హిట్టు కొట్టిన మొదటి హీరో కూడా మెగాస్టారే. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఆయన సినిమా ఎప్పుడెప్పుడు చేస్తాడా అని నిర్మాతలంతా వేచి చూశారు.
ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టడంతో నిర్మాతలంతా షాక్ అయ్యారు. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ ను స్థాపించి అందులోనే ఖైదీ నెం.150 సినిమా నిర్మించాడు. ఆ ఒక్క సినిమాతోనే అయిపోతుందేమో అనుకుంటే సినిమాను కూడా సైరా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే వస్తుంది. రాబోయే కొరటాల శివ సినిమాను కూడా బ్యానర్ లో నిర్మిస్తున్నారు రామ్ చరణ్.
ఇలా వరసగా చిరంజీవి సినిమాలన్నీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతుండటంతో మిగిలిన నిర్మాతలు అసహనానికి లోనవుతున్నారు. తమకు చిరంజీవి డేట్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటున్నారు. చిరంజీవి వస్తే ఆయనతో సినిమాలు నిర్మించడానికి ఎప్పట్లాగే అల్లు అరవింద్, అశ్వినీదత్ లాంటి సీనియర్ నిర్మాతలు వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లకు కూడా చిరు డేట్స్ దొరకడం కష్టంగా మారిపోయింది.