అఖిల్ కు మరో షాక్ ఇచ్చిన మిస్టర్ మజ్ను.. అయినా ప్రమోషన్ తో బిజీ..

అఖిల్ హీరోగా నటించడం ఇష్టం మజ్ను సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా నిరాశపరిచింది. ఆరు రోజుల తర్వాత ఈ సినిమా కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 24 కోట్లు వసూలు చేస్తే గాని హిట్ అనిపించుకోని మిస్టర్ మజ్ను.m ఇప్పటివరకు సగం మాత్రమే వసూలు చేసింది. ఇకపై వసూళ్లు తీసుకొస్తుందనే నమ్మకం కూడా లేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్లను కొంతైనా బయటకు లాగాలని అఖిల్ ప్రమోషన్ మొదలుపెట్టాడు. హీరోయిన్ నిధి అగర్వాల్.. దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి విశాఖపట్నంతో పాటు మరి కొన్ని పట్టణాలు తిరుగుతున్నాడు.

ఎన్ని పట్టణాలు తిరిగిన మిస్టర్ మజ్ను మాత్రం ప్రేక్షకులకు చేరువ కాలేకపోతోంది. వసూళ్ల విషయంలో ఈ చిత్రం చాలా వెనుకబడి పోయింది. కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో ఇంకా 12 కోట్లు వెనకబడింది మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను ఊహించనంతగా మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ తేడా కొట్టడంతో సినిమా డిజాస్టర్ అయిపోయింది. దాంతో నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు.

ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు అక్కినేని వారసుడు. అయితే ఈ మధ్య క్రిష్ పునర్జన్మల నేపథ్యంలో ఒక కథ చెబితే అది అఖిల్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఇదే అఖిల్ తర్వాత సినిమా కావచ్చు. ఏదేమైనా ఓవైపు మిస్టర్ మజ్ను ప్రమోషన్ తో బిజీగా ఉంటూనే.. మరోవైపు తర్వాత సినిమాపై కూడా దృష్టి పెట్టాడు అక్కినేని వారసుడు. మరి ఈయన కోరుకుంటున్న విజయం తర్వాత సినిమాతో అయినా వస్తుందో లేదో అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here