తమిళంలో విడుదలవుతున్న అర్జున్ రెడ్డి..

అదేంటి అర్జున్ రెడ్డి సినిమాను ఆల్రెడీ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు కదా.. మళ్లీ ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో విడుదల చేయడం ఏంటి అనుకుంటున్నారా.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. తమిళనాడు అర్జున్ రెడ్డి సినిమా విడుదల కానుంది కానీ విడుదలవుతుంది మాత్రం అర్జున్ రెడ్డి సినిమా కాదు. ఏంటి కన్ఫ్యూషన్ అని అవసరం లేదు. ఇక్కడ విడుదలైన ద్వారక సినిమాను తమిళనాట అర్జున్ రెడ్డి పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తర్వాత చేసిన సినిమా ఇది.

arjun reddy

ఇక్కడ డిజాస్టర్ గా నిలిచింది ద్వారక. దొంగ బాబాల మీద చేసిన సినిమా ఇది. శ్రీనివాస రవీంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పూజా ఝవేరి హీరోయిన్. తెలుగులో డిజాస్టర్ అయిన ద్వారక సినిమాను ఇప్పుడు తమిళనాట అర్జున్ రెడ్డి పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా అర్జున్ రెడ్డి ఇప్పుడు చాలా పాపులర్.. అందుకోసమే ఈ టైటిల్ ను ఈ సినిమా కోసం వాడేసుకుంటున్నారు. త్వరలోనే ద్వారక తమిళనాట విడుదల కానుంది. మరి ఇక్కడ చేతులెత్తేసిన ఈ సినిమా తమిళనాట ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదైనా అర్జున్ రెడ్డి క్రేజ్ మాత్రం ఇప్పటికీ వదలడం లేదు నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here