చిరంజీవి పదంపై రామ్ చరణ్ అభ్యంతరం..

అదేంటి తండ్రి పేరుపై రామ్ చరణ్ కూడా అభ్యంతరం ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు సైరా సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచిస్తున్నారు. సింగిల్ కార్డ్ ఈయనే. ఇక ఓ పాటలో సందర్భానుసారంగా చిరంజీవి అనే పద ప్రయోగం చేశాడు సీతారామశాస్త్రి. పాట అందరికీ నచ్చిన కూడా రామ్ చరణ్ మాత్రం చిరంజీవి అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రత్యేకంగా కారణాలు ఏమీ లేకపోయినా కూడా చిరంజీవి అనే పదం పెడితే కావాలని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందని రామ్ చరణ్ ఈ పదాన్ని తొలగించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై సిరివెన్నెల కూడా ఆలోచిస్తున్నాడు.

నిర్మాత చెప్పిన తర్వాత ఇక తిరుగేముంది. చిరంజీవి పదం బదులు మరొక పదం వాడుతున్నాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ తివారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ కూడా మొదలైపోయింది. షూటింగ్ కూడా దాదాపు 70 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చూసి రామ్ చరణ్ ఖుషి అవుతున్నాడు. అయితే అనుకున్న దానికంటే షూటింగ్ నెమ్మదిగా జరుగుతుండటం ఒక్కటే ఈ నిర్మాతను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే పాటల విషయంలో కూడా చరణ్ బాగానే చొరవ తీసుకుంటున్నాడు. మొత్తానికి తండ్రి పేరుతో వచ్చే పాటను వద్దనుకొని మరో పదాన్ని కలపాలంటూ సిరివెన్నెలకు సూచించాడు మెగా వారసుడు. అయినా చిన్న హీరోలు ఇలా పేర్లు వాడుకుంటే సొంత డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది కానీ.. చిరంజీవి లాంటి మెగాస్టార్ పేరు వాడితే అభిమానుల ఇంకా సంతోష పడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here