అనుకున్న‌ట్లుగానే ఎఫ్2 తో గ‌ట్టిగానే న‌వ్విస్తున్నారుగా..

వెంక‌టేష్ కామెడీ చేస్తే చూడాల‌ని అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద మ‌ల్లీశ్వ‌రీ, నువ్వు నాకు న‌చ్చావ్ లాంటి సినిమాల త‌ర్వాత ఈయ‌న‌తో కామెడీ చేయించిన ద‌ర్శ‌కుడు మ‌రొకరు లేరు. న‌మో వెంక‌టేశ లాంటి సినిమాలు వ‌చ్చినా కూడా అవి హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఎఫ్2 సినిమాపై ఇవే అంచ‌నాలున్నాయి. పైగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు కూడా ముందు నుంచే భారీగా ఉన్నాయి. వ‌రుణ్ తేజ్ కూడా హీరో కావ‌డం.. మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుండ‌టంతో ఎఫ్2 సంక్రాంతికి ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా క‌చ్చితంగా హిట్ కొడుతుంద‌నే ధీమాతోనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
F2 Movie First Day Collections
F2 Movie First Day Collections
ఇప్పుడు చెప్పిన‌ట్లుగానే వాళ్లు పండ‌క్కి బాగా గ‌ట్టిగాన‌వ్విస్తున్నారు. పండ‌గ సినిమాల్లో అందరికంటే చివ‌ర్లో వ‌చ్చిన ఎఫ్2 క‌చ్చితంగా విజ‌యం సాధించేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేతులెత్తేయ‌డంతో ఎఫ్2 క‌లెక్ష‌న్లు కుమ్మేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రంతో వ‌ర‌స‌గా నాలుగో విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజ‌యంతో అనిల్ డిమాండ్ మ‌రింత‌గా పెరిగిపోయింది. ఈయ‌న త‌ర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందో తెలియ‌దు కానీ దానిపై ఇప్ప‌ట్నుంచే అంచ‌నాలు పెరిగిపోవ‌డం మాత్రం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here