అనుష్క సినిమా కోసం వ‌స్తున్న హాలీవుడ్ హీరో.. 

ఏడాదిన్న‌ర త‌ర్వాత అనుష్క మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తుంది. ఈమె న‌టించ‌బోయే సినిమాకోసం ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ రెడీ అయిపోయింది. కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రలో నటించబోతుంది అనుష్క‌. అదేంటి అదెలా సాధ్యం.. హీరో చేసిన పాత్రలో హీరోయిన్ ఎలా నటిస్తుంది.. ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కదా. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే అనుష్క.. రామ్ చరణ్ పాత్రలో నటించబోతోంది.
తన తర్వాత సినిమా కోసం రంగస్థలంలో చిట్టిబాబు పోషించిన పాత్ర ఇప్పుడు జేజమ్మ కూడా పోషించబోతోంది. అసలు విషయం ఏంటంటే అనుష్క త్వరలోనే కోన వెంకట్ తో ఒక సినిమా చేయబోతుంది. ఈ చిత్రం టైటిల్ సైలెన్స్. ఇందులో అనుష్క పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. సైలెన్స్ సినిమాలో అనుష్కకు చెవులు వినిపించవు. అలాగే మాటలు కూడా అంతంతమాత్రంగానే వస్తాయని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తాను సిద్ధం చేసుకుంటుంది జేజమ్మ.
మాధవన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. 12 ఏళ్ల కింద ఈ హీరోతో రెండు అనే సినిమా చేసింది అనుష్క. ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు చాలాకాలం వరకు చూడలేదు జేజమ్మ. ఇన్నేళ్లకు మళ్లీ మాధవన్ తో కలిసి నటించబోతోంది అనుష్క. ఈమధ్య సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇప్పుడు మరోసారి అనుష్కతో కలిసి నటించబోతున్నాడు ఈ హీరో. ఇక ఇదే సినిమాలో హాలీవుడ్ హీరో మైఖెల్ మ్యాడ్స‌న్ కూడా న‌టించ‌బోతున్నాడు. ఈ చిత్రంలో చాలా భాగం షూటింగ్ అమెరికాలో జ‌ర‌గ‌నుంది. అందుకే అక్క‌డి న‌టున్ని తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్ మొద‌లు కానుంది. మొత్తానికి మరి అనుష్క ఈ చెవుడు పాత్రలో ఎలా నటించబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here