మీరు ఏదైనా చేయండి కానీ నాకు మాత్రం ఒక్క హిట్టు ఇవ్వండి.. ఇప్పుడు అఖిల్ కోరుకుంటున్నది. ఇదే ఎన్నో అంచనాలతో వచ్చిన అఖిల్, హలో సినిమాలో నిరాశపరచడంతో ఈయన మూడో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. మిస్టర్ మజ్ను జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ టాక్ కూడా బాగానే ఉంది. పదేళ్ల కింద రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా కథను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
వెంకీ అట్లూరి కూడా ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు. 18 ఏళ్ల కింద వచ్చిన ప్రేమతో రా సినిమా లో వెంకటేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అఖిల్ పాత్ర కూడా అలాగే ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికితోడు ఆరెంజ్ సినిమా కథ కూడా ఇందులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్టు వాళ్ల ఆలోచనలకి దగ్గరగా ఉండే మిస్టర్ మజ్ను సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నాడు వెంకీ అట్లూరి. 2 గంటల 25 నిమిషాల ఐడియల్ రన్ టైంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి అఖిల్ కోరుకుంటున్న విజయాన్ని మిస్టర్ మజ్ను తీసుకొస్తాడా లేదా అనేది చూడాలి ఇంకా.