అంగ‌రంగ వైభ‌వంగా అన్న‌గారి సినిమా.. 

NBK NTR Biopic
ఎన్టీఆర్.. ఈ మూడు అక్ష‌రాలు తెలుగు తెర‌పైనే కాదు.. తెలుగువారి గుండెల్లో కూడా చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. వెండితెర ఇల‌వేల్పే కాదు.. ప్ర‌తీ తెలుగువాడి ఆత్మ‌గౌర‌వ‌పు బావుటా మ‌న అన్న‌గారు. నంద‌మూరి తారక రామారావు అనే పేరులోనే ఏదో తెలియ‌ని మ‌త్తు ఉంది. ఆ పేరును అలా ప‌లుకుతూ ఉండిపోవ‌డ‌మే. ఇప్పుడు ఈ మ‌హానుభావుడి జీవితంపై సినిమా రాబోతుంది. అది కూడా త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా. మార్చ్ 29 ఉద‌యం 9.42 నిమిషాల‌కు ఎన్టీఆర్ కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన రామ‌కృష్ణ స్టూడియోస్ లోనే భారీగా అంగ‌రంగ వైభ‌వంగా ఈ చిత్ర ఓపెనింగ్ జ‌రిగింది. ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులంతా ఈ వేడుక‌కు వ‌చ్చారు. ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ముఖ్య అతిథిగా వ‌చ్చి బాల‌య్య‌ను ఆశీర్వ‌దించారు. Clickhere:Balakrishna NTR Biopic Launch Photos
ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ అంతా పూర్తి చేసిన తేజ‌.. మ‌రోసారి క‌థ‌పై కూర్చోనున్నాడు. రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ నుంచి మొద‌లు కానుంది. కేవ‌లం ఆర్నెళ్ల‌లోనే సినిమా పూర్తిచేసి.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంతో బాల‌య్యే నిర్మాత‌గా మారారు. బ్ర‌హ్మ‌తేజ ప్రొడ‌క్ష‌న్స్ పై సాయికొర్ర‌పాటి.. విష్ణు ఇందూరి స‌హ నిర్మాత‌లుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ నిర్మిస్తున్నారు బాల‌కృష్ణ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here