అందం అదుర్స్.. అభిన‌యం బెదుర్స్..


ఇప్పుడు మాళ‌విక శ‌ర్మ‌ను చూసిన త‌ర్వాత అంతా ఇదే అనుకుంటున్నారు. నేల‌టికెట్ సినిమాతో ఈ భామ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. రిలీజ్ కి ముందు మాళ‌విక‌ను చూసి అంతా ఫిదా అయిపోయారు. అమ్మాయి అందాల ఆర‌బోత‌లో పిహెచ్ డీ పూర్తి చేసింది. సినిమాలో న‌ట‌న కూడా అదే రేంజ్ లో చేస్తే మాత్రం ఇక్క‌డే సెటిల్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ అది అంతా ఈజీ కాద‌ని అర్థ‌మైపోయింది. దానికి కార‌ణం అమ్మాయికి అందాల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌..
అభిన‌యంపై లేద‌ని అర్థ‌మైపోయింది. నేల‌టికెట్ లో అస‌లు మాళ‌విక కారెక్ట‌ర్ కు పెద్ద‌గా స్కోప్ లేదు. పాట‌లకు అలా వ‌చ్చి వెళ్ల‌డం త‌ప్ప‌. దానికితోడు సినిమా కూడా అంతంతమాత్రంగానే ఉండ‌టంతో ఈ బ్యూటీకి తొలి సినిమాతోనే పెద్ద షాక్ త‌గిలింది. ర‌వితేజ లాంటి స్టార్ హీరోతో ఎంట్రీ అంటే ఏదేదో ఊహించుకుని వ‌చ్చుంటుంది పాపం మాళ‌విక‌. కానీ ఇక్క‌డ అంత సినిమా లేదు. మ‌రి ఈ భామ‌కు రెండో అవ‌కాశ‌మైనా వ‌స్తుందో.. లేదంటే వ‌న్ మూవీ వండ‌ర్ గా నిలిచిపోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here