అందాల ఆ..కృతిని కాస్త ప‌ట్టించుకోండ‌య్యా..!


చివ‌రి వ‌ర‌కు ఓటమి ఒప్పుకోకు.. గెలుపు కోసం ప్ర‌య‌త్నించు.. ఇండ‌స్ట్రీలో ఉండాలంటే ఇదే అర్థం చేసుకోవాలి. కృతిక‌ర్బందాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. కొంద‌రు ముద్దుగుమ్మ‌లకు సినిమాల‌తో ప‌నిలేదు. కేవ‌లం అందాలతోనే చంపేస్తుంటారు వాళ్లు. అలాంటి వాళ్లలో కృతిక‌ర్భందా ముందుంటుంది. ఈ భామ‌కు స‌రైన సినిమాలు ప‌డ‌ట్లేదు కానీ ఇండ‌స్ట్రీలో మాత్రం నెట్టుకొస్తూనే ఉంది. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ దండం పెట్టి పంపినా.. బాలీవుడ్ లో అదృష్టం ప‌రీక్షించుకుంటుంది ఈ భామ‌. ఎనిమిదేళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతిక‌ర్భందా.. ఇప్ప‌టికీ ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ భామ జాత‌కం మార్చ‌లేదు. దాంతో ఇప్పుడు కృతి ముందున్న ఏకైక ల‌క్ష్యం అందాల ఆర‌బోత‌. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.
ఓ వైపు అక్క పాత్ర‌లు చేస్తూనే మ‌రో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు కృతి క‌ర్బందా. ఆ మ‌ధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియ‌ల్ నే అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఓ హింట్ వ‌దిలేసింది కృతి. ఆ త‌ర్వాతే బాలీవుడ్ లో రాజ్ 4 సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీ, గౌర‌వ్ అరోరాల‌తో రొమాన్స్ చేసింది. ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. అయినా అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాత‌కం మార‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కిణిలా మారిపోయింది కృతిక‌ర్భందా. ఈ మ‌ధ్యే రాజ్ కుమార్ రావ్ తో క‌లిసి న‌టించిన షాదీ మే జ‌రూర్ ఆనా సినిమాలోనూ ముద్దుల‌తో ముంచెత్తింది. ఇక ఇప్పుడు వీరి కి వెడ్డింగ్ లోనూ గ్లామ‌ర్ షోతో చంపేసింది కృతి. ఏ ఈవెంట్ కు వ‌చ్చినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. మొత్తానికి అస్త్రాల‌న్నీ బాగానే వాడుతుంది ఈ బ్యూటీ. మ‌రి అదృష్టం ఎప్పుడు క‌లిసొస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here