అక్ష‌య్ కుమార్.. బాలీవుడ్ ద‌త్త‌పుత్రుడు..

అవును.. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. షారుక్ ఖాన్ ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు హిట్లు ఇవ్వ‌డం లేదు. స‌ల్మాన్ ఏడాదికో చిత్రం చేస్తున్నాడు. ఇక అమీర్ ఎప్పుడొస్తాడో ఆయ‌న‌కే తెలియ‌దు. ఉన్నోళ్ల‌లో ఎప్పుడూ సినిమాలు చేసుకుంటూ.. ఏడాదికి క‌నీసం త‌న వ‌ల్ల 500 కోట్ల‌కి పైగా వ్యాపారం ఇస్తున్న హీరో అక్ష‌య్ కుమార్. ఏదో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసి చేతులు దులిపేసుకుందాం అనుకోకుండా త‌నకున్న ఇమేజ్ ను సామాజిక బాధ్య‌త కోసం వాడుకుంటున్నాడు అక్ష‌య్ కుమార్. ఇదే ఇప్పుడు ఈయన్ని మిగిలిన హీరోల నుంచి వేరు చేస్తుంది. అంతెందుకు ఈ ఏడాది ఈయ‌న న‌టించిన జాలీ ఎల్ఎల్ బీ 2తో పాటు టాయ్ లెట్ కూడా సూప‌ర్ హిట్టైంది. ఈ రెండు సినిమాల్లోనూ సమాజానికి కావాల్సిన విష యాల‌నే డిస్క‌స్ చేసాడు అక్ష‌య్.
ప్ర‌తీ ఇంట్లో ఓ బాత్రూమ్ ఉండాలి.. ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించాలి.. అని చెప్పే క‌థ ఇది. ఈ సినిమా చూసిన త‌ర్వాత అంతా అక్ష‌య్ పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. ప్ర‌ధాని మోదీతో పాటు. ఇక ఇప్పుడు మ‌రో సినిమా చేస్తున్నాడు అక్ష‌య్. అదే ప్యాడ్ మ్యాన్. ఆడ‌వాళ్ళ‌కు పీరియ‌డ్స్ వ‌చ్చిన‌పుడు వ‌చ్చే ఇబ్బందుల‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు అక్ష‌య్ కుమార్ అండ్ టీం. బాల్కీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. క‌నీసం ఆలోచించ‌డానికి కూడా భ‌య‌ప‌డే కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేసాడు అక్ష‌య్ కుమార్. మ‌రి ఈయ‌న క‌ష్టానికి ఎలాంటి ఫ‌లితం రాబోతుందో.. జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here