అఖిల్ అప్పుడే మ‌జ్ను అవుతాడా..?


ఇప్ప‌టికే ఓ సారి ప్రేమ‌లో విఫ‌లం అయ్యాడు అఖిల్. సినిమాలో కాదు.. నిజంగానే. త‌ను ప్రేమించిన శ్రేయాభూపాల్ తో విడిపోయాడు అఖిల్. ఈ మ‌ధ్యే ఆమె మ‌రొక‌ర్ని పెళ్లి కూడా చేసుకుంది. ప్రేమ విఫ‌ల‌మైనా కూడా మ‌జ్ను కాలేదు అఖిల్. కానీ ఇప్పుడు సినిమా కోసం అయ్యేలా ఉన్నాడు. నాగార్జున టైటిల్ ను ఇప్ప‌టికే నాని వాడేసాడు. ఆయ‌న రెండేళ్ల కిందే మ‌జ్ను అయ్యాడు. అది కూడా బాగానే ఆడింది.
కానీ ఇప్పుడు అఖిల్ కూడా ఇదే అవుతానంటున్నాడు. అందుకే కేవ‌లం మ‌జ్ను అయితే బాగుండదేమో అని మిస్ట‌ర్ మ‌జ్ను అవుతున్నాడు సిసింద్రీ. ఈయ‌న మూడో సినిమాకి డిఫెరెంట్ టైటిల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్పుడు ఓ సినిమా వ‌స్తుంది. తొలిప్రేమ‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ద‌ర్శ‌కుడు మ‌రోసారి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాణంలోనే సినిమా చేస్తున్నాడు. అఖిల్ కోసం ప్ర‌త్యేకంగా ఈ క‌థ సిద్ధం చేసాడు వెంకీ. ఈ చిత్రానికి మిస్ట‌ర్ మ‌జ్ను టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు వెంకీ అట్లూరి.
జూన్ నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. లండ‌న్ లో ఎక్కువ భాగం షూటింగ్ జ‌ర‌గ‌నుంది. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలున్నాయి. హ‌లోతో ప‌ర్లేదు అనిపించుకున్న అఖిల్.. మూడో సినిమాతో క‌చ్చితంగా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ మిస్ట‌ర్ మ‌జ్ను ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here