అఖిల్.. ఎవ‌రూ ఊహించ‌ని ద‌ర్శ‌కుడితో..!

Akhil
అఖిల్ ఇప్పుడు చాలా మారిపోయాడు. మూడేళ్ల కింద అఖిల్ ఇలా లేడు. మాస్ వైపు అడుగులు వేస్తూ లేనిపోని ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేసిన అఖిల్ మ‌న‌కు క‌నిపిస్తాడు. కానీ ఇప్పుడు మ‌నోడు చాలా మారిపోయాడు. మ‌న‌కు ఏం కావాలో ఒక్కోసారి మ‌న‌కంటే మ‌న‌కు కావాల్సిన వాళ్ల‌కే ఎక్కువ‌గా తెలుస్తాయి. అఖిల్ విష‌యంలో నాగార్జున ఇదే చేస్తున్నాడు. ఈయ‌న త‌న త‌న‌యున్ని క్లాస్ హీరోగా చూడాల‌నుకుంటున్నాడు. అంద‌మైన ప్రేమ‌క‌థ‌ల్లో న‌టిస్తే బాగుంటుంద‌నుకున్నాడు. ఇప్పుడు అఖిల్ కూడా తండ్రి లాగే ఆలోచిస్తున్నాడు. ఇక‌పై క‌థ కొత్త‌గా ఉంటే చాలు.. మాస్ ఇమేజ్ అవ‌స‌రం లేద‌నుకుంటున్నాడు ఈ హీరో. అందుకు త‌గిన‌ట్లుగానే ఇప్పుడు ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తున్నాడు అఖిల్. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అఖిల్ మూడో సినిమా కోసం ఓ ద‌ర్శ‌కుడు లైన్ లోకి వ‌చ్చాడు.
అత‌డే స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కొడుకు.. హీరో ఆది పినిశెట్టి అన్న‌య్య ఈయ‌న‌. ఇదివ‌ర‌కు త‌మ్ముడుతో మ‌లుపు సినిమా చేసాడు స‌త్య‌. అది యావ‌రేజ్ గా ఆడింది. ఇప్పుడు ఈయ‌న అఖిల్ కు ఓ క‌థ చెప్పాడ‌ని తెలుస్తుంది. అది సిసింద్రీకి కూడా బాగా న‌చ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 10 లోపు ఈ క‌థ‌పై ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పాడు అఖిల్. మొత్తానికి ఇప్పుడు క‌థ బాగుంటే చాలు.. క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రం లేదంటున్నాడు అఖిల్. ఈ మార్పు వ‌స్తే చాలు విజ‌యం దానంత‌ట అదే వ‌స్తుంది. ఇప్ప‌టికే హ‌లో ఫ్లాప్ అయినా కూడా హీరోగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అక్కినేని వార‌సుడు. చూడాలిక మూడో సినిమాతో అఖిల్ కెరీర్ ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here