అఖిల్ కు ఇప్ప‌టికి మూడొచ్చింది..

Akhil Akhil3

అస‌లే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఇన్నాళ్ల‌కు మ‌రో సినిమా మొద‌లు పెట్టాడు ఈ హీరో. ఓ వైపు సినిమాకు క‌మిటైన త‌ర్వాత మ‌రోవైపు గాళ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు అఖిల్. ఇంత‌కీ ఎవ‌రా గాళ్ ఫ్రెండ్ అనుకుంటున్నారా..? ఆల్రెడీ ఒక‌సారి శ్రేయాభూపాల్ తో నిశ్చితార్థం వ‌ర‌కు వెళ్లి ఆగిపోయింది అఖిల్ పెళ్లి. దాంతో ఇప్పుడు గాళ్ ఫ్రెండ్స్ కు దూరంగా ఉన్నాడు అక్కినేని వార‌సుడు.

కానీ త‌న‌కు మాత్రం ఇప్పుడు ఉన్న గాళ్ ఫ్రెండ్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి అని చెప్పాడు అఖిల్. త‌న టైమ్ అంతా ఇప్పుడు ఈయ‌న‌కే కేటాయిస్తున్న‌ట్లు చెబుతున్నాడు అఖిల్. ఇప్పుడు మొద‌లుపెట్టి ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది అఖిల్ ప్లాన్. అంటే ఉన్న‌ది మూన్నెళ్ల టైమ్ అంతే. క‌ష్ట‌మైనా స‌రే కానీ పూర్తి చేస్తామంటున్నాడు ఈ హీరో.

చిన్న చిన్న షెడ్యూల్ బ్రేక్స్ తో నాన్ స్టాప్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో. పైగా షూట్ అంతా లండ‌న్ లోనే జ‌ర‌గ‌బోతుంది. ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లైంది. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో అఖిల్ తో జోడీ క‌ట్టింది. ద‌స‌రాకు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత కూడా రానుంది. అయినా కూడా అఖిల్ వెన‌క‌డుగు వేయ‌ట్లేదు. మ‌రి చూడాలిక‌.. ఏం చేస్తాడో ఇప్పుడు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here